ముప్ఫై ఏళ్ళ గా మాదిగల చిరకాల స్వప్నం యస్సీ వర్గీకరణ

ఓబులదేవర చెరువు 04

ముప్ఫై ఏళ్ళ గా మాదిగల చిరకాల స్వప్నం యస్సీ వర్గీకరణ

ముప్పై ఏళ్ల మాదిగల చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ

  డప్పు వాయిద్యాల మధ్య విజయోత్సవ ర్యాలీశ్రీసత్యసాయిజిల్లా,ఓడిచెరువు(విజయస్వప్నం.నెట్)ఆగష్టు04:-30 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అలుపెరుగని పోరాటం చేశారని ఆ పోరాట ఫలితంగానే ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ సమంజసమైందని ధర్మాసనం తీర్పు వెల్లడించడంతో ఆదివారం ఓడిచెరువు మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీ స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు లక్ష్మన్న,నాగల భావన్న,మహాజన జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎల్లంరాజు కత్తి ఆనంద్ లు మాట్లాడుతూ మాదిగలు చిరకాల స్వప్నం ఎస్సీ వర్గీకరణ అని మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగానే షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధ్యమైందని మాదిగలు విద్యా,ఉద్యోగ రంగాలలో అగ్రభాగాన నిలవడానికి ఎస్సీ వర్గీకరణ ఎంతో ఉపయోగపడుతుందని వారు తెలిపారు అంతకుమునుపు వైఎస్ఆర్ సర్కిల్ నుండి బిఎస్ఎన్ఎల్ టవర్ వరకు డప్పు వాయిద్యాల మధ్య కోలాహలంతో టపాసులు పేలుస్తూ ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించార ఈకార్యక్రమంలో మండలంలోని మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మిఠాయిలు పంచి పెట్టారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు రమణ సీనియర్ నాయకులు ఎర్రదొడ్డప్ప,పలక గంగన్న, మాజీ మండలాధ్యక్షులు శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొచ్చు కదిరప్ప ఎంఈఎఫ్ జిల్లా కార్యదర్శి వై.నరసింహులు మాజీ మండల ఉపాధ్యక్షులు చౌడంపల్లి రామాంజనేయులు  ఎంవిఎఫ్ నాయకులు వై,రామాంజి సర్వేయర్ గంగప్ప,తుమ్మలకుంట్లపల్లి నరసింహులు మాజీ సర్పంచ్ రమణ నర్సింహులు నరేష,పక్కిరప్ప,మారప్ప,ధారా రమణ సీనియర్ నాయకులు తోల నాగభూషణ తంగేడుకుంట రమణ ఎమ్మెస్ఎఫ్ లక్ష్మీపతి  డప్పు నరేష్,కురమాల గంగాద్రి రవి అక్కులప్ప యూ నరసింహులు తదితరులు పాల్గొన్నారు